మేడ్చల్‌లో కారు బోల్తా.. భారీగా ట్రాఫిక్ జామ్

🔸జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తాపడిన కారు.. తప్పిన పెను ప్రమాదం ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జాతీయ రహదారిపై కారు బోల్తాపడటంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఒక్కసారిగా రోడ్డుపై కారు బోల్తాపడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులుఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కారు ఎలా బోల్తాపడిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాద సమయంలో కారులో ఒక్కరే ఉన్నట్లు సమాచారం.అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంతో కొంతసేపు జాతీయ రహదారిపై వాహనాల...