RJNEWS TELUGU
Date of Publish : 06 October 2026, 9:38 pm Posted by : RJ NEWS TELUGU

మాజీ బీజేవైఎం జాతీయ కోశాధికారిపై కేసు

🔸బీజేపీ ఎస్సీ మోర్చా సోషల్‌ మీడియా కన్వీనర్‌ ఫిర్యాదు
🔸వేధింపులు, బెదిరింపులు, అసభ్య పదజాలం వాడారంటూ ఆరోపణలు
🔸అల్వాల్‌ పోలీసుల కేసు నమోదు.

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : మాజీ బీజేవైఎం జాతీయ కోశాధికారి పి.ఎం. సాయి ప్రసాద్‌ అలియాస్‌ ‘టీమ్‌ సాయి’పై అల్వాల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎస్సీ మోర్చా సోషల్‌ మీడియా కన్వీనర్‌ డి. పద్మిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు.

ఫిర్యాదులో..

తాను గత కొన్నేళ్లుగా సాయి ప్రసాద్‌, ఆయన బృందంతో కలిసి పనిచేశానని, ఈ ఏడాది ఏప్రిల్‌ 1న వారి నుంచి విడిపోయినట్లు పద్మిని తెలిపారు. అయితే అప్పటి నుంచి సాయి ప్రసాద్‌ తనను పదేపదే భయపెట్టడం, వేధించడం, బెదిరించడం చేశారని ఆరోపించారు.
తనను కులపరంగా, లైంగికంగా అసభ్య పదజాలంతో దూషించారని, భర్త, పిల్లలకు తీవ్ర హాని కలిగిస్తానని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు ఇష్టం లేకపోయినా తనతో సంభాషణ కొనసాగించేలా ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.

వేర్వేరు సందర్భాల్లో వేధింపులు

2024 డిసెంబరు 24, 2025 ఏప్రిల్‌ 1, ఆగస్టు 9 తేదీల్లో వేర్వేరు సమయాల్లో తాను సాయి ప్రసాద్‌ నివాసంలో ఉన్నప్పుడు తనపై ఒత్తిడి తెచ్చినట్లు పద్మిని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను వేధిస్తూ, బెదిరింపులకు పాల్పడిన ఘటనలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు.ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణల ఆధారంగా అల్వాల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆరోపణలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.