కోర్టు నుంచి కేఎల్ఆర్ కమాన్ వరకు 400 మీటర్ల రోడ్డు నిర్మాణం
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ సర్కిల్ పరిధిలోని పూడూర్ – కిష్టాపూర్ డివిజన్లో కార్పొరేషన్ నిధులు రూ.80 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు రొయ్యపల్లి మల్లేష్ గౌడ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కోర్టు నుంచి కేఎల్ఆర్ కమాన్ వరకు 9 మీటర్ల వెడల్పు, 400 మీటర్ల పొడవున సీసీ రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. గతంలో రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యను సైబరాబాద్ కమిషనర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి, నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేసినట్లు పేర్కొన్నారు. రోడ్డు నిర్మాణ పనులు పూర్తయితే స్థానిక ప్రజలకు రవాణా ఇబ్బందులు తొలగి సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వేముల శ్రీనివాస్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్ దేవ, శేఖర్ గౌడ్, రవీందర్ రెడ్డి, హనుమంత రెడ్డి, లింగం, రంజిత్, సాయి, గర్దాస్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.