నేరేడ్‌మెట్‌లో చైన్‌ స్నాచింగ్‌ కేసు ఛేదింపు..! ముగ్గురు నిందితుల అరెస్ట్‌.. బంగారు గొలుసు, బైక్‌ స్వాధీనం

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా నేరేడ్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన చైన్‌ స్నాచింగ్‌ కేసును ఛేదించినట్లు మల్కాజిగిరి ఏసీపీ యాదగిరి తెలిపారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు.సెప్టెంబర్‌ 12న శివనగర్‌ ప్రాంతంలో ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును ముగ్గురు నిందితులు అపహరించినట్లు తెలిపారు. ఘటన అనంతరం సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టి సెప్టెంబర్‌ 15న నిందితులను అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు.అరెస్టయిన వారిని రిహాన్‌ అహ్మద్‌, మహమ్మద్‌ సోను, ఆసిఫ్‌గా గుర్తించినట్లు ఏసీపీ తెలిపారు. వీరు ఎల్‌బీనగర్‌లో...