కీసరలో చైన్ స్నాచింగ్ – వృద్ధురాలి మెడలోంచి 2 తులాల గొలుసు లాక్కెళ్లిన దుండగుడు
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం అన్నపూర్ణ కాలనీలో శకుంతల అనే 68 ఏళ్ల వృద్ధురాలు తన కుమార్తె ఇంటికి వెళ్లేందుకు తన ఇంటిలో వస్తువులను సర్దుకుంటున్న సమయంలో, వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లినట్లు బాధితురాలు తెలిపింది. సమాచారం అందుకున్న కీసర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ప్రధానంగా సీసీ టీవీ కెమెరాలు...