RJNEWS TELUGU
Date of Publish : 16 September 2026, 10:25 am Posted by : RJ NEWS TELUGU

యాదగిరి మృతికి చైర్మన్, కమిషనర్ సంతాపం

ఆర్.జె.న్యూస్, శామీర్ పేట : మూడుచింతలపల్లి మున్సిపాలిటీ ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఎడుముళ్ల యాదగిరి అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతికి మున్సిపల్‌ చైర్మన్‌ జాము రవి, కమిషనర్‌ వెంకట గోపాల్‌ సంతాపం తెలిపారు. యాదగిరి అంత్యక్రియలకు హాజరైన వారు భౌతికకాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.యాదగిరి మృతి బాధాకరమని చైర్మన్‌ జాము రవి పేర్కొన్నారు. మున్సిపల్‌ సిబ్బందిగా ఆయన అందించిన సేవలను మరువలేమన్నారు. కుటుంబానికి రూ.21 వేల ఆర్థికసాయం అందించారు. యాదగిరి కుటుంబానికి మున్సిపల్‌ సిబ్బంది అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్‌ సిబ్బంది, స్థానిక నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.