“చైర్‌పర్సన్ శిరీష నియంతలా వ్యవహరిస్తున్నారు.. ప్రజాప్రతినిధుల గౌరవాన్ని కాలరాస్తున్నారు” స్థానిక కౌన్సిలర్‌ను పక్కనపెట్టి ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం.
మేడ్చల్ ( ఆర్ జె న్యూస్ ):అలియాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ శిరీష వ్యవహార శైలి రోజురోజుకూ నియంతృత్వాన్ని తలపిస్తోందని 7వ వార్డు కౌన్సిలర్ వెంకటేష్ తీవ్రస్థాయిలో ఆరోపించారు. ప్రజల ఓట్లతో గెలిచిన స్థానిక కౌన్సిలర్‌కు కనీస సమాచారం ఇవ్వకుండా, ఆహ్వానించకుండా 7వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రజాస్వామ్య విలువలను కాలరాయడమేనని మండిపడ్డారు.గతంలోనూ ఇదే విధంగా స్థానిక ప్రజాప్రతినిధులను అవమానిస్తూ కార్యక్రమాలు నిర్వహించగా తాము తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసి మందలించినప్పటికీ, చైర్‌పర్సన్ తన తీరు మార్చుకోలేదని విమర్శించారు. ప్రజలతో నిత్యం...