RJNEWS TELUGU
Date of Publish : 08 November 2026, 9:02 pm Posted by : RJ NEWS TELUGU

గుండ్లపోచంపల్లి డివిజన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి జన్మదిన వేడుకలు

🔸కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు.. ప్రజలకు పండ్ల పంపిణీ

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి జన్మదిన వేడుకలను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుండ్లపోచంపల్లి 299వ డివిజన్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం మాజీ అధికార ప్రతినిధి గరిసెల సురేందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సురేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా నడిపించే శక్తి, సామర్థ్యాలను అందించాలని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం ప్రజలకు పండ్లు పంపిణీ చేసి, గుండ్లపోచంపల్లి డివిజన్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సాయిపేట శ్రీనివాస్, గుండ్లపోచంపల్లి మాజీ సర్పంచ్ బేరి ఈశ్వర్, శ్రీలక్ష్మీనారాయణ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గడిల కృష్ణారెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బొజ్జ ఆదిలక్ష్మి, జిల్లా మహిళా కార్యదర్శి మరిలమ్మ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కావేరి శేఖర్, దొడ్ల మోహన్ ముదిరాజ్, అమరం సురేష్‌రెడ్డి, యువజన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు నవీన్ ముదిరాజ్, మైనార్టీ విభాగం అధ్యక్షుడు షేక్ మహబూబ్, అబుద్దిన్, చిల్ల వెంకటేష్ ముదిరాజ్, సేవాదళ్ అధ్యక్షుడు సాయి ముదిరాజ్, మాజీ ఎంపీటీసీ పులిగళ్ల రాజేశ్వర్, సాయిపేట సురేష్, చింత భాస్కర్ ముదిరాజ్, బొక్క శ్రీకాంత్‌రెడ్డి, ఎల్. వినోద్ గౌడ్, చింతల హరిబాబు ముదిరాజ్, కేతన్, నాగేష్ గౌడ్, నాగరాజురెడ్డి, బలరాంరెడ్డి, బాసుపల్లి రామకృష్ణారెడ్డి, జెసింతమ్మ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.