RJNEWS TELUGU
Date of Publish : 18 October 2026, 8:02 am Posted by : RJ NEWS TELUGU

మేడ్చల్‌లో సీఎంసీ కమిషనర్ పర్యటన

🔸ఆర్టీసీ డిపోలో బాక్స్ డ్రైనేజీ నిర్మాణంపై పరిశీలన

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మేడ్చల్‌లో సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన శనివారం పర్యటించారు. ఆర్టీసీ డిపో, కేఎస్ఆర్ వెంచర్‌తో పాటు పలు ప్రాంతాల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయా పనులపై సంబంధిత అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు.మేడ్చల్ ఆర్టీసీ డిపోలోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా డ్రైనేజీ నీరు చేరుతుండటంతో ఉద్యోగులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు బాక్స్ డ్రైనేజీ నిర్మాణ ప్రతిపాదనను కమిషనర్ పరిశీలించారు. నిర్మాణానికి రూపొందించిన మ్యాపులను పరిశీలించి, పనుల నిర్వహణపై అధికారులతో చర్చించారు. అనంతరం కేఎస్ఆర్ వెంచర్, శివాజీ విగ్రహ కూడలి, ఫేజ్‌-2లో అభివృద్ధి చేయనున్న పార్కు ప్రతిపాదిత స్థలాన్ని సందర్శించారు. అభివృద్ధి పనుల ప్రణాళికలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ పింకేశ్ కుమార్, డిప్యూటీ కమిషనర్ సుధాంశు, కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు రొయ్యపల్లి మల్లేశ్ గౌడ్, నాయకులు ఉద్దంపురం సత్యనారాయణ, శేఖర్ గౌడ్, రవీందర్ రెడ్డి, ఇంజినీర్లు పాల్గొన్నారు.

.