RJNEWS TELUGU
Date of Publish : 16 September 2026, 10:41 pm Posted by : RJ NEWS TELUGU

పేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ చేయూత

ఆర్ జె న్యూస్ శామీర్ పేట : అత్యవసర వైద్య చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) ద్వారా ఆర్థిక సాయం అందించినట్లు మేడ్చల్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని 10 మంది లబ్ధిదారులకు రూ.3.47 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ సాయం మంజూరవగా, సంబంధిత చెక్కులను బుధవారం ఆయన లబ్ధిదారులకు అందజేశారు.ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటామని మల్లారెడ్డి పేర్కొన్నారు. వైద్య చికిత్స కోసం ఇబ్బందులు పడుతున్న వారికి సీఎంఆర్‌ఎఫ్‌ సాయం కొంత ఊరటనిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో లబ్ధిదారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.