RJNEWS TELUGU
Date of Publish : 21 September 2026, 8:33 pm Posted by : RJ NEWS TELUGU

ప్రజల సమస్యలపై కలెక్టర్ సీరియస్.. అధికారులకు వార్నింగ్!

ఆర్ జె న్యూస్, శామీర్ పేట : ప్రజావాణికి వచ్చిన అర్జీలను నిబంధనల మేరకు వెంటనే పరిష్కరించాలని మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ మిక్కిలినేని మను చౌదరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ విజయేందర్‌రెడ్డితో కలిసి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.రెవెన్యూ, పంచాయతీరాజ్‌, పౌరసరఫరాలు, మున్సిపల్‌ తదితర శాఖలకు సంబంధించి 106 అర్జీలు అందినట్లు కలెక్టర్‌ తెలిపారు. ప్రజల సమస్యలను ప్రాధాన్య క్రమంలో పరిశీలించి వేగంగా పరిష్కరించాలని సూచించారు. అర్జీలపై తీసుకున్న చర్యల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో మాలతి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.