RJNEWS TELUGU
Date of Publish : 08 July 2026, 5:16 pm Posted by : RJ NEWS TELUGU

శామీర్‌పేటలో ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ మను చౌదరి

మేడ్చల్ జిల్లా (ఆర్ జె న్యూస్,) జూలై 8 :

రైతులు ఎరువుల కొనుగోళ్లను తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫర్టిలైజర్’ ఆన్‌లైన్ యాప్ ద్వారానే చేపట్టాలని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి సూచించారు. బుధవారం శామీర్‌పేటలోని షేక్ చాంద్ ఎరువుల దుకాణాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా యాప్ పనితీరు, ఆన్‌లైన్‌లో ఎరువుల బుకింగ్ విధానాన్ని కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి రైతు ముందుగా ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేసుకుని, అనంతరం యాప్ ద్వారా ఎరువులను బుక్ చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు ఈ యాప్ ద్వారా 3,598 ఎరువుల బుకింగ్‌లు నమోదయ్యాయని, వాటి ద్వారా 753 మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులు పొందినట్లు తెలిపారు. తనిఖీలో జిల్లా వ్యవసాయ అధికారి చంద్రకళ, మండల వ్యవసాయ అధికారి రమేష్, వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీనాథ్, ఎరువుల డీలర్లు, రైతులు పాల్గొన్నారు