శామీర్‌పేటలో ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ మను చౌదరి
మేడ్చల్ జిల్లా (ఆర్ జె న్యూస్,) జూలై 8 : రైతులు ఎరువుల కొనుగోళ్లను తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫర్టిలైజర్' ఆన్‌లైన్ యాప్ ద్వారానే చేపట్టాలని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి సూచించారు. బుధవారం శామీర్‌పేటలోని షేక్ చాంద్ ఎరువుల దుకాణాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా యాప్ పనితీరు, ఆన్‌లైన్‌లో ఎరువుల బుకింగ్ విధానాన్ని కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి రైతు ముందుగా ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేసుకుని, అనంతరం యాప్ ద్వారా...