బాలసదనం పిల్లలకు కలెక్టర్ ఆత్మీయ ఆతిథ్యం రాఖీలు కట్టిన చిన్నారులు.. స్వీట్లు, కొత్త దుస్తులు అందజేత
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో బాలసదనం పిల్లలతో రాఖీ వేడుకలను ఆత్మీయంగా నిర్వహించారు. ప్రభుత్వ బాలసదనానికి చెందిన బాలబాలికలు జిల్లా కలెక్టర్ మను చౌదరికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కలెక్టర్ బాలసదనం పిల్లల కోసం ప్రత్యేకంగా భోజనం ఏర్పాటు చేశారు. చిన్నారులతో కలిసి భోజనం చేసిన ఆయన వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పిల్లలకు స్వీట్లు, కొత్త దుస్తులను అందజేశారు. వారితో ఆప్యాయంగా ముచ్చటిస్తూ వారి అవసరాలను తెలుసుకున్నారు. 🔸చదువు, ఆరోగ్యానికి...