అలియాబాద్‌లో రూ.8 లక్షలతో CC రోడ్డు పనుల ప్రారంభం..! చైర్‌పర్సన్ శిరీష కృష్ణారెడ్డి శంకుస్థాపన
ఆర్.జె.న్యూస్, అలియాబాద్ : అలియాబాద్ పురపాలక సంఘం పరిధిలోని 1వ వార్డు మరియు 3వ వార్డుల్లో మున్సిపల్ జనరల్ నిధులతో చేపట్టిన CC రోడ్డు నిర్మాణ పనులను గురువారం చైర్‌పర్సన్ శ్రీమతి కంఠం శిరీష కృష్ణారెడ్డి ప్రారంభించారు. రూ.8.00 లక్షల వ్యయంతో చేపడుతున్న ఈ పనులతో స్థానిక ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలగనుంది.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ శిరీష మాట్లాడుతూ, అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు మెరుగైన రహదారులు మరియు మౌలిక వసతులు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని...