ఉత్తమ సేవలకు కమిషనర్‌ వెంకట్‌రెడ్డికి ప్రశంసా పత్రం

ఆర్.జె.న్యూస్,మేడ్చల్ జిల్లా : ఉత్తమ సేవలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో చొరవ చూపిన అలియాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ ఎన్‌. వెంకట్‌రెడ్డికి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ మను చౌదరి చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందజేశారు.మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు, నూతనంగా ఎన్నికైన పాలకవర్గం చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌, కౌన్సిలర్ల సహకారంతో ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించేందుకు చేపట్టిన చర్యలను జిల్లా అధికారులు అభినందించారు. ముఖ్యంగా వనమహోత్సవంలో విస్తృతంగా మొక్కలు నాటడం, పర్యావరణ...