అలియాబాద్‌లో డ్రైనేజీలపై కమిషనర్ తనిఖీ పూడికతీత వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం

మేడ్చల్ (ఆర్ జె న్యూస్) జూలై 3 : వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో చేపడుతున్న ఓపెన్ డ్రైనేజీ నాలాలు, ప్రధాన మురుగు కాలువల పూడికతీత పనులను మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకట్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. అలియాబాద్ ఆవాస ప్రాంతం చుట్టూ సుమారు రెండు కిలోమీటర్ల మేర ఉన్న డ్రైనేజీలను సందర్శించి పనుల పురోగతిని అధికారులతో సమీక్షించారు.నాలాల్లో పేరుకుపోయిన పూడిక, చెత్తాచెదారం, వ్యర్థాలను వెంటనే తొలగించి వర్షపు నీరు, మురుగునీరు ఎలాంటి ఆటంకం లేకుండా పారేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు....