కంటోన్మెంట్‌లో కలకలం.. మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ!
ఆర్.జె.న్యూస్, బొల్లారం : హైదరాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని మద్రాస్ రెజిమెంట్ లో ఆయుధాల చోరీ కలకలం రేపింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉన్న ఆయుధాల గదిలోకి చొరబడి గుర్తుతెలియని వ్యక్తులు ఆయుధాలను ఎత్తుకెళ్లారు. ఆదివారం రాత్రి ఈ చోరీ జరిగినట్లు ఆర్మీ అధికారులు గుర్తించారు. ఆయుధాల గది తాళం పగులగొట్టి 12 ఆయుధాలను దుండగులు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. చోరీకి గురైన వాటిలో 4 ఏకే-47లు, 6 పిస్టళ్లు, ఒక ఇన్సాస్ రైఫిల్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆయుధాలతో పాటు మందుగుండు సామగ్రిని కూడా అపహరించారు....