RJNEWS TELUGU
Date of Publish : 15 September 2026, 8:37 pm Posted by : RJ NEWS TELUGU

ఇంజినీరింగ్‌తో సమాజాభివృద్ధి

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ఇంజినీరింగ్‌ విద్యార్థులు నూతన ఆలోచనలు, సృజనాత్మకతతో సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకొని సమాజాభివృద్ధికి దోహదపడాలని చామకూర గోపాల్‌రెడ్డి అన్నారు. సీఎంఆర్ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీలో నిర్వహించిన ఇంజినీర్స్‌ డే వేడుకల్లో ఆయన మాట్లాడారు. సాంకేతిక రంగంలో వేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఇంజినీరింగ్‌ కేవలం ఉద్యోగం కోసం కాకుండా సమాజ సమస్యలకు పరిష్కారాలు చూపించే రంగంగా ఎదగాలని ఆకాంక్షించారు. ముఖ్య అతిథి ఎస్.ఎమ్. ప్రకాష్‌ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి సారించాలని సూచించారు. నూతన ఆవిష్కరణల వైపు అడుగులు వేస్తూ భవిష్యత్‌ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలని అన్నారు. దేశ ప్రగతిలో ఇంజినీర్ల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డా. కె. శ్రీనివాసరావు, సంగీత, చామకూర అభినవ్‌రెడ్డి, ఫ్యాకల్టీ ఇన్‌చార్జ్‌లు టి. రోహిణిరెడ్డి, నాగరాజునాయక్, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.