ఆర్.జె.న్యూస్, వెబ్ డెస్క్ : మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ గౌతమ్‌నగర్ మాజీ కార్పొరేటర్ భర్త రాము యాదవ్‌పై మల్కాజిగిరి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇతర ప్రాంతానికి సంబంధించిన హత్య కేసులోని వ్యక్తితో మైనంపల్లి హనుమంతరావుకు సంబంధించిన పాత ఫొటోలు, వీడియోలను రాము యాదవ్ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఆయన ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కావాలనే ఉద్దేశపూర్వకంగా మైనంపల్లి హనుమంతరావుపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఇది రాజకీయ కుట్రలో భాగమేనని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. గతంలోనూ సంబంధం లేని వ్యవహారాలపై తప్పుడు ప్రచారం చేసినందుకు రాము యాదవ్‌పై కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. రాము యాదవ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు
.