మేడ్చల్ ( ఆర్ జె న్యూస్ ) జూలై 07 :
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారిని స్వర్ణలత వ్యవహార శైలిపై సోమవారం పలువురు జర్నలిస్టులు కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరికి ఫిర్యాదు చేశారు. జిల్లాలో మంజూరైన అక్రిడిటేషన్ల సంబంధిత జర్నలిస్టులకు అంద జేయడంలో జరుగుతున్న జాప్యంపై ఫిర్యాదు చేశారు. అదే విధంగా అక్రిడిటేషన్ల ఇచ్చిన వారికి బస్సు పాసులు అప్రూవల్ చేయడం లేదని ఫిర్యాదులు పేర్కొన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 252 ప్రకారమే అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ల మంజూరు చేయడం జరిగిందని, వీటిని జర్నలిస్టులకు ఇవ్వడంలో చిన్న చిన్న కారణాలు చూపిస్తూ డిపిఆర్ఓ అడ్డుకోవడం జరుగుతుందని వివరించారు. అదే విధంగా జిల్లాలో ఉన్న ఆన్ ఎంప్యానల్ పత్రికల కార్యాలయాలకు ప్రైవేట్ వ్యక్తులను పంపించి విచారణ చేయించడంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించి అర్హులందరికీ అక్రిడిటేషన్ల ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు యూనియన్ నాయకులు మెరుగు చంద్రమోహన్ బెలిదే అశోక్ గుప్తా, ముత్యం ముఖేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.