మేడ్చల్ డిపిఆర్ఓ వ్యవహార శైలిపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు..! అర్హులందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వాలి
మేడ్చల్ ( ఆర్ జె న్యూస్ ) జూలై 07 : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారిని స్వర్ణలత వ్యవహార శైలిపై సోమవారం పలువురు జర్నలిస్టులు కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరికి ఫిర్యాదు చేశారు. జిల్లాలో మంజూరైన అక్రిడిటేషన్ల సంబంధిత జర్నలిస్టులకు అంద జేయడంలో జరుగుతున్న జాప్యంపై ఫిర్యాదు చేశారు. అదే విధంగా అక్రిడిటేషన్ల ఇచ్చిన వారికి బస్సు పాసులు అప్రూవల్ చేయడం లేదని ఫిర్యాదులు పేర్కొన్నారు. ప్రభుత్వం విడుదల...