RJNEWS TELUGU
Date of Publish : 16 September 2026, 9:17 pm Posted by : RJ NEWS TELUGU

కౌకూర్‌ – యాప్రాల్‌ అభివృద్ధికి పక్కా ప్రతిపాదనలు

🔸అధికారులతో సమీక్షలో శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి

ఆర్ జె న్యూస్ వెబ్ డెస్క్ : కౌకూర్‌, యాప్రాల్‌ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మల్కాజిగిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం శాసనసభ్యుల క్యాంపు కార్యాలయంలో కౌకూర్‌, యాప్రాల్‌ డివిజన్ల అభివృద్ధి పనులపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులు, తాగునీరు, మురుగునీరు, విద్యుత్ తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. క్షేత్రస్థాయిలో ప్రజల అవసరాలను పరిశీలించి, ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాల్సిన పనులకు సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన పనులను గుర్తించి, సంబంధిత శాఖల సమన్వయంతో అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు. కౌకూర్‌ – యాప్రాల్‌ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ప్రతిపాదనలను త్వరితగతిన సిద్ధం చేసి తదుపరి చర్యలు చేపట్టాలని శాసనసభ్యులు సూచించారు. సమావేశంలో విద్యుత్ శాఖ సహాయక విభాగ ఇంజనీర్ ప్రభాకర్ రెడ్డి, సహాయ ఇంజనీర్ శ్రీనివాస్, జలమండలి ఉప ప్రధాన వ్యవస్థాపకులు వెంకటేశ్వర్లు, మల్లికార్జున్, మేడ్చల్ మున్సిపల్ సహాయ ఇంజనీర్ సత్యలక్ష్మి, భారత రాష్ట్ర సమితి నాయకులు జాయింట్ యాక్షన్ కమిటీ వెంకన్న, కరంచంద్, లక్ష్మణ్ యాదవ్, వెంకటేష్ యాదవ్, రాజు యాదవ్, చిందం శ్రీనివాస్, అల్లి శ్రీనివాస్, రమేష్, తిరుపతిరావు రెడ్డి, హనుమాన్ చారి, సతీష్, శోభ, విక్రమ్, రత్న మేరీ, రమ, పరిమళ, శ్రీలత, హంస తదితరులు పాల్గొన్నారు.