మట్టి వినాయకుల పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా కాంగ్రెస్ నాయకులు మట్టి వినాయక విగ్రహాలను భక్తులకు పంపిణీ చేశారు. డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించడం ద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుందని, రసాయనాలతో తయారు చేసిన విగ్రహాల వల్ల నీటి కాలుష్యం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ పర్యావరణహితమైన మట్టి వినాయక విగ్రహాలను ఉపయోగించి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించాలని కోరారు....