RJNEWS TELUGU
Date of Publish : 24 September 2026, 10:13 pm Posted by : RJ NEWS TELUGU

శస్త్రచికిత్స అనంతరం బాలుడికి పరామర్శ

🔸రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన కౌన్సిలర్‌ అర్చన శ్రీనివాస్‌

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : ఎల్లంపేట మున్సిపాలిటీ 24వ వార్డుకు చెందిన వడ్డే కృష్ణ, అరుణ దంపతుల కుమారుడు చింటూకు ఇటీవల శస్త్రచికిత్స జరిగింది. విషయం తెలుసుకున్న 24వ వార్డు కౌన్సిలర్‌ అర్చన శ్రీనివాస్‌ గురువారం వారి ఇంటికి వెళ్లి బాలుడిని, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా చింటూ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సహాయం అందించారు. బాలుడు త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు. కుటుంబానికి అవసరమైన సమయంలో అండగా ఉంటామని తెలిపారు.