శాంతియుత గణేష్ ఉత్సవాలకు సహకరించాలి
🔸మండప నిర్వాహకులకు కీసర పోలీసుల అవగాహన ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు మండప నిర్వాహకులు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని జవహర్ నగర్ ఏసీపీ చక్రపాణి సూచించారు. గణేష్ విగ్రహాల ఏర్పాటు, ఉత్సవాల నిర్వహణ, నిమజ్జనం, భద్రతా చర్యలు, నియమ నిబంధనలపై మండప నిర్వాహకులు, గ్రామ ప్రజలు, కాలనీ అసోసియేషన్ సభ్యులకు అవగాహన కల్పించేందుకు శనివారం కీసర పోలీస్ స్టేషన్‌లో కార్యక్రమం నిర్వహించారు. కీసర పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఆర్కపల్లి ఆంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏసీపీ...