రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయ చర్యలు..! ప్రమాదాల నివారణే లక్ష్యం

ఆర్ జె న్యూస్, మేడ్చల్: మేడ్చల్ జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించి, ప్రజలకు సురక్షిత ప్రయాణం కల్పించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సూచించారు. శనివారం మేడ్చల్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల గుర్తింపు, రోడ్డు సూచికల ఏర్పాటు, వేగ నియంత్రణ, పాదచారుల భద్రత, రోడ్డు మార్కింగ్‌లు, వీధి దీపాల ఏర్పాటు తదితర అంశాలపై సమీక్షించారు. గత సమావేశంలో తీసుకున్న...