భారీ వర్షాలు, గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు శనివారం బంజారాహిల్స్‌లోని టీ-జీఐసీసీసీ (కమాండ్ కంట్రోల్ సెంటర్)ను సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. భారీ వర్షాలతో పాటు నగరంలో జరగనున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఏర్పాట్లను కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిశీలించారు. బాలాపూర్ నుంచి ప్రారంభమయ్యే ప్రధాన శోభాయాత్ర మార్గాల్లో రహదారుల పరిస్థితి, మరమ్మతులు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నియంత్రణ, నీరు నిలిచే ప్రాంతాల్లో...