క్యాబ్ డ్రైవర్ హత్య కేసు ఛేదించిన సైబరాబాద్ పోలీసులు – ముగ్గురు అరెస్ట్

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : పటాన్‌చెరు పరిధిలో సంచలనం సృష్టించిన క్యాబ్ డ్రైవర్ హత్య, దోపిడీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందన్నారు. మహారాష్ట్రకు చెందిన ఘోడకే రాహుల్, సూరజ్ శశికాంత్, బాంబ్లే రాజులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన వివరాలు : సెప్టెంబర్ 10 రాత్రి సికింద్రాబాద్ లో నిందితులు క్యాబ్ డ్రైవర్ నెలమర్రి రాజశేఖర్ ను ముంబై...