RJNEWS TELUGU
Date of Publish : 11 September 2026, 5:37 pm Posted by : RJ NEWS TELUGU

డి.ఎస్. జగన్‌కు అదనపు సంచాలకుడిగా పదోన్నతి : TUWJ, TTWJA నాయకుల అభినందనలు

ఆర్.జె.న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖలో డి.ఎస్. జగన్ అదనపు సంచాలకుడిగా పదోన్నతి పొందిన సందర్భంగా జర్నలిస్ట్ యూనియన్ నాయకులు ఆయనను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ) H-143 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్, డి.ఎస్. జగన్‌ను కలిసి అభినందించారు. కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రభుత్వం–ప్రజల మధ్య సమాచార వారధిగా మరింత సమర్థవంతమైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. తెలంగాణ ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (TTWJA) రాష్ట్ర అధ్యక్షుడు, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (IJU) నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు, 6TV బ్యూరో చీఫ్, సీనియర్ జర్నలిస్ట్ మాలోత్ తిరుపతి నాయక్ కూడా డి.ఎస్. జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సమాచార, పౌర సంబంధాల శాఖలో జగన్ అందించిన సేవలు, విధి నిర్వహణలో ఆయన చూపిన నిబద్ధత, సమర్థత ప్రశంసనీయమని పేర్కొన్నారు. అదనపు సంచాలకుడిగా కొత్త బాధ్యతల్లోనూ విజయవంతంగా రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో TUWJ రాష్ట్ర కోశాధికారి యోగానంద్, IJU జాతీయ సభ్యుడు, సీనియర్ జర్నలిస్ట్ అవ్వారి భాస్కర్, హైదరాబాద్ TUWJ ఇన్‌చార్జ్ నవీన్ యార్ తదితరులు పాల్గొని డి.ఎస్. జగన్‌కు అభినందనలు తెలిపారు. డి.ఎస్. జగన్‌కు లభించిన ఈ పదోన్నతి ఆయన అంకితభావంతో అందించిన సేవలకు దక్కిన గుర్తింపుగా జర్నలిస్ట్ యూనియన్ నాయకులు అభివర్ణించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత బాధ్యతలు చేపట్టి విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.