డి.ఎస్. జగన్‌కు అదనపు సంచాలకుడిగా పదోన్నతి : TUWJ, TTWJA నాయకుల అభినందనలు

ఆర్.జె.న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖలో డి.ఎస్. జగన్ అదనపు సంచాలకుడిగా పదోన్నతి పొందిన సందర్భంగా జర్నలిస్ట్ యూనియన్ నాయకులు ఆయనను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ) H-143 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్, డి.ఎస్. జగన్‌ను కలిసి అభినందించారు. కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రభుత్వం–ప్రజల మధ్య సమాచార వారధిగా మరింత సమర్థవంతమైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. తెలంగాణ ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (TTWJA) రాష్ట్ర అధ్యక్షుడు,...