మేడ్చల్‌లో పగటిపూట చైన్ స్నాచింగ్

ఆర్.జె.న్యూస్,మేడ్చల్ : మేడ్చల్ జిల్లా కేంద్రంలో పగటిపూట చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ రైల్వే స్టేషన్ రోడ్డుకు చెందిన జక్కుల సుజాత (58) ఒంటరిగా వెళ్తుండగా, హెల్మెట్‌లు ధరించిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు పల్సర్ బైక్‌పై వేగంగా వచ్చారు. క్షణాల్లో సుజాత మెడలోని బంగారు గొలుసును సుమారు 3.5  తులాలు లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో...