RJNEWS TELUGU
Date of Publish : 06 September 2026, 5:33 pm Posted by : RJ NEWS TELUGU

మాదాపూర్ లో డీసీఎం బీభత్సం – పలు వాహనాలకు ఢీ

ఆర్.జె.న్యూస్, మాదాపూర్ : దుర్గం చెరువు రోడ్డుపై నిన్న రాత్రి 11:30 గంటలకు ఓ డీసీఎం బీభత్సం సృష్టించింది. ఓవర్ స్పీడ్ తో అదుపుతప్పిన డీసీఎం మూడు బైక్స్, పలు ఆటోలు, కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంతో దుర్గం చెరువు రోడ్డుపై కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డీసీఎం డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.