ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కాకతీయ కాలనీలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఓయో హోటల్ సమీపంలో గురువారం ఉదయం 9.53 గంటలకు మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వయసు సుమారు 40 నుంచి 45 ఏళ్లు ఉంటుందని, ఎత్తు 5.5 అడుగుల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. పింక్ రంగు చెక్స్ షర్టు, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నట్లు పేర్కొన్నారు. కుడిచేతిపై తెలుగులో ‘అమ్మ’ అనే అక్షరాలతో పచ్చబొట్టు ఉందని తెలిపారు. ప్రాథమికంగా గుండెపోటుతో మృతి చెంది ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతుడిని గుర్తించినవారు, అతడి బంధువులు లేదా తెలిసినవారు ఎవరైనా ఉంటే మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ను(8712662702)సంప్రదించాలని పోలీసులు కోరారు.