ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్: తనపై క్షుద్రపూజలు చేశారంటూ కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మండిపడ్డారు. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ పై సాక్ష్యాధారాలతో డెఫమేషన్ కేసు ఫైల్ చేసినట్లు తెలిపారు. కోర్టు తన పిటిషన్ ను యాక్సెప్ట్ చేసిందని, బుధవారం 30వ తేదీన తన స్టేట్ మెంట్ ను రికార్డ్ చేస్తామని కోర్టు చెప్పినట్లు హరీష్ రావు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీల అమలు ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా డిప్యూటీ స్పీకర్ నియామకం జరగలేదని, సభ హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చినా స్పీకర్ పట్టించుకోవడం లేదన్నారు. భవిష్యత్తులో తనపై అబద్ధపు ప్రచారాలు చేస్తే ఎవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
దానం నాగేందర్ వ్యవహారంపై స్పందన :
దానం నాగేందర్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు రేవంత్ రెడ్డికి చెంపపెట్టు అని హరీష్ రావు అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాతనైనా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కనువిప్పు కావాలని, ఎమ్మెల్యేలను కాపాడాలని స్పీకర్ ప్రయత్నించారని విమర్శించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలందరికీ దానం నాగేందర్ లాంటి తీర్పే ఎదురవుతుందని పేర్కొన్నారు.