ఎంపీపీఎస్ రఠంశాల పాఠశాలలో డీఈఓ తనిఖీ

🔸విద్యార్థుల అభ్యసన సామర్థ్యం, మధ్యాహ్న భోజనంపై పరిశీలన ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : మేడ్చల్‌ మండలంలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) రేణుక దేవి మంగళవారం తనిఖీ చేశారు. మేడ్చల్‌ మండల విద్యాధికారి వై. శంకరయ్యతో కలిసి పాఠశాలను సందర్శించిన ఆమె విద్యార్థుల అభ్యసన స్థాయి, బోధన, పాఠశాల నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత, పరిశుభ్రత, వంట చేసే...