298వ డివిజన్‌లో డిప్యూటీ కమిషనర్ సుధాంష్ పర్యటన

ఆర్.జె.న్యూస్,మేడ్చల్‌ : జీహెచ్‌ఎంసీ పరిధిలోని 298వ డివిజన్‌లో నెలకొన్న రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పార్కులు, కాలనీలకు సంబంధించిన సమస్యలను పరిశీలించేందుకు డిప్యూటీ కమిషనర్ సుధాంష్ మంగళవారం ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్‌ నాయకులు ఆయనను కలిసి స్థానిక సమస్యలను వివరించారు. రోడ్ల అధ్వాన పరిస్థితి, డ్రైనేజీ సమస్యలు, తాగునీటి ఇబ్బందులు, పార్కుల అభివృద్ధి, కాలనీల్లో మౌలిక వసతుల కొరత తదితర అంశాలను డిప్యూటీ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను విన్న సుధాంష్ సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులతో మాట్లాడి...