RJNEWS TELUGU
Date of Publish : 02 September 2026, 3:50 pm Posted by : RJ NEWS TELUGU

రూ.24.50 లక్షల అభివృద్ధి పనులకు శ్రీకారం

🔸ఎల్లంపేటలో డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ఎల్లంపేట పురపాలక సంఘం పరిధిలో రూ.24.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్‌పర్సన్ లావుడ్యా శ్రీదేవి రమేష్ శంకుస్థాపన చేశారు.
పురపాలక సంఘం 2వ వార్డులోని కాసింభాయ్ తండాలో రూ.7.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు, 7వ వార్డు రావల్ కోల్ ప్రాంతంలో రూ.17 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు బుధవారం ఆమె శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ శ్రీదేవి రమేష్ మాట్లాడుతూ వార్డుల సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌ చైర్‌పర్సన్ మేకల రజిత దేవేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు కుమార్, శ్రీలత రమేష్, సురేష్ రెడ్డి, భాస్కర్, శారద రాజు నాయక్,అర్చన శ్రీనివాస్, ఏఈ దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.