ఒక్క OTP చెప్పారా.. ఖాతా ఖాళీ!

🔸సైబర్ మాయగాళ్ల వలలో పడొద్దు.. 🔸విద్యార్థులకు సీఐ గురువయ్య గౌడ్ హెచ్చరిక ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ఒక చిన్న పొరపాటు.. ఒక అనుమానాస్పద లింక్‌పై క్లిక్.. ఒక ఓటీపీ షేర్.. అంతే క్షణాల్లో బ్యాంకు ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని జీనోమ్ వ్యాలీ సీఐ గోపగాని గురువయ్య గౌడ్ హెచ్చరించారు. సైబర్ మాయగాళ్ల కొత్త ఎత్తుగడలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.జీనోమ్ వ్యాలీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మజీద్‌పూర్ శ్రీ చైతన్య స్కూల్‌లో నిర్వహించిన సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంలో సుమారు 200 మంది...