టాక్సిక్ ప్రీ రిలీజ్ వేడుకలో అపశ్రుతి
🔸విద్యార్థులపై పడిన సౌండ్ స్పీకర్లు.. పలువురికి గాయాలు 🔸నిబంధనలు ఉల్లంఘించారంటూ నిర్వాహకులపై కేసు ఆర్.జె.న్యూస్, బ్యూరో : మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో శనివారం రాత్రి నిర్వహించిన ‘టాక్సిక్’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో అపశ్రుతి చోటుచేసుకుంది. భారీ సంఖ్యలో విద్యార్థులు, అభిమానులు తరలివచ్చిన సమయంలో సౌండ్ స్పీకర్లు విద్యార్థులపై పడటంతో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని అంబులెన్సుల్లో సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు. రాజ్‌కుమార్ (20)కు చేయి, కాలికి ఫ్రాక్చర్ అయినట్లు సమాచారం. మరో ముగ్గురికి కూడా గాయాలయ్యాయి. 🔸అధిక జనసందోహంతో గందరగోళం...