RJNEWS TELUGU
Date of Publish : 26 September 2026, 4:34 pm Posted by : RJ NEWS TELUGU

అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ

ఆర్ జె న్యూస్, మూడుచింతలపల్లి : మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉద్దెమర్రి గ్రామంలోని శ్రీ అక్కన్న మాదన్న శ్రీ విష్ణు శివాలయంలో శనివారం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ (ఏబీఏపీ) మేడ్చల్‌ జిల్లా ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు.ఏబీఏపీ మేడ్చల్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీపతి నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ కోశాధికారి రాయబారపు రవిరాజు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు టీవీ పుల్లెం రాజు, రాష్ట్ర కార్యదర్శి దూశెట్టి భాస్కర్‌,  అధ్యక్షుడు సత్యం గురుస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేశారు. ప్రతి శనివారం ఆలయంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం భక్తులకు ఆధ్యాత్మిక సేవతో పాటు సేవాభావాన్ని పెంపొందిస్తోందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి అయ్యప్ప స్వామి భక్తులతో పాటు ఆలయానికి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఏబీఏపీ ట్రస్ట్‌ సభ్యులు, అయ్యప్ప స్వామి భక్తులు, ఆలయ భక్తులు తదితరులు పాల్గొన్నారు.