గుండ్లపోచంపల్లిలో కొత్త రేషన్‌ స్మార్ట్‌ కార్డుల పంపిణీ

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : గుండ్ల పోచంపల్లి డివిజన్‌ పరిధిలో అర్హులైన పేద కుటుంబాలకు కొత్త రేషన్‌ స్మార్ట్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. వీఆర్వో ప్రభు, రేషన్‌ డీలర్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్‌ నాయకులు లబ్ధిదారులకు కార్డులు అందజేశారు.ఈ సందర్భంగా డివిజన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, గౌడవల్లి మాజీ సర్పంచ్‌ గరిసెల సురేందర్‌ ముదిరాజ్‌ మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తోందన్నారు. గత కొంతకాలంగా రేషన్‌ కార్డుల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు కొత్త స్మార్ట్‌ కార్డులు అందించడం సంతోషకరమన్నారు. అర్హులైన...