RJNEWS TELUGU
Date of Publish : 04 August 2026, 5:45 pm Posted by : RJ NEWS TELUGU

అలియాబాద్ మున్సిపాలిటీలో మొక్కల పంపిణీ

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో మంగళవారం వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకట్ రెడ్డి పాల్గొని మొక్కలు నాటి, స్థానికులకు ఉచితంగా మొక్కలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఛైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా భావితరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వనమహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.అనంతరం స్థానిక ప్రజలకు ఉచితంగా మొక్కలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.