అలియాబాద్ మున్సిపాలిటీలో మొక్కల పంపిణీ
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో మంగళవారం వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకట్ రెడ్డి పాల్గొని మొక్కలు నాటి, స్థానికులకు ఉచితంగా మొక్కలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఛైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా భావితరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన...