మునీరాబాద్‌లో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మునీరాబాద్‌లో గురువారం స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పౌరసరఫరాల శాఖ అధికారి లక్ష్మీకాంత్‌, రేషన్‌ డీలర్‌, ఇందిరమ్మ కమిటీ సభ్యుల సమక్షంలో లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. కార్యక్రమానికి 299వ డివిజన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గరిసెల సురేందర్‌ ముదిరాజ్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన పేదలందరికీ రేషన్‌ కార్డులు అందేలా కృషి చేస్తామన్నారు. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని తెలిపారు.కార్యక్రమంలో జిల్లా ఓబీసీ సెల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రవి ముదిరాజ్‌, మాజీ...