ఇన్‌స్పెక్టర్ ప్రశాంత్‌కు జిల్లా ప్రశంసా పత్రం
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అల్వాల్ పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ప్రశాంత్‌కు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ప్రశంసా పత్రం లభించింది. జిల్లా కలెక్టర్ మను చౌదరి సమక్షంలో ఐపీఎస్ అధికారి సురేష్‌కుమార్ ప్రశంసా పత్రాన్ని ఇన్‌స్పెక్టర్ ప్రశాంత్‌కు అందజేశారు. అల్వాల్ పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు చేపట్టిన ఏడాది కాలంలోనే ప్రశాంత్ సమర్థవంతమైన విధులు నిర్వహించి ఈ ప్రతిష్ఠాత్మక గుర్తింపును అందుకున్నారు. కీలక కేసుల ఛేదనలో చురుకైన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు విశేష కృషి చేశారు. విధి నిర్వహణలో అంకితభావం, సత్వర...