మరుగుదొడ్ల అపరిశుభ్రతపై డీఎంహెచ్‌వో ఆగ్రహం

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యం, పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వహించవద్దని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డా. కె. ఆనంద్ సూచించారు. హస్మత్‌పేట్‌లోని మండల పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం ఆయన సందర్శించి విద్యార్థుల ఆరోగ్యం, పోషణ, పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. పాఠశాలలోని ఆహార నిల్వల స్టాక్‌ రిజిస్టర్‌ను తనిఖీ చేసి కూరగాయల నాణ్యతను పరిశీలించారు. వంటశాలను సందర్శించి భోజన తయారీలో పాటిస్తున్న పరిశుభ్రత, ఆహార నాణ్యత, వంటగది నిర్వహణను పరిశీలించారు. పాఠశాల మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మరుగుదొడ్లను...