గాజులరామారం యూపీహెచ్‌సీలో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ

🔸విధుల్లో నిర్లక్ష్యంపై ఆగ్రహం.. 🔸వైద్య సేవలు మెరుగుపరచాలని ఆదేశం   ఆర్.జె.న్యూస్,మేడ్చల్‌ : గాజులరామారం యూపీహెచ్‌సీని మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా డీఎంహెచ్‌ఓ డా. కె. ఆనంద్‌ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విధుల్లో ఉండాల్సిన మెడికల్‌ ఆఫీసర్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌ (ఎల్‌టీ) ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరైనట్లు గుర్తించారు. దీనిపై సంబంధిత సిబ్బందిని వివరణ కోరిన డీఎంహెచ్‌ఓ.. విధుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు.యూపీహెచ్‌సీలోని మందుల నిల్వలను స్టాక్‌ రిజిస్టర్‌తో సరిపోల్చి పరిశీలించారు. మందుల లభ్యత, ముఖ్యంగా సమీప గడువు (నియర్‌ ఎక్స్‌పైరీ)...