అనధికార ఆసుపత్రులపై డీఎంహెచ్‌వో కొరడా
🔸మేడ్చల్‌లో రెండు ఆసుపత్రులు సీజ్.. 🔸స్వరూప నర్సింగ్ హోమ్‌కు నోటీసులు ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : నిబంధనలు పాటించకుండా వైద్య సేవలు అందిస్తున్న ఆసుపత్రులపై వైద్యారోగ్య శాఖ అధికారులు కొరడా ఝళిపించారు. మేడ్చల్ పరిధిలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించిన చిన్న హాస్పిటల్, సాక్షి హాస్పిటల్‌లను సీజ్ చేశారు.జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్ ఆనంద్ ఆధ్వర్యంలో అధికారులు ఆయా ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రుల నిర్వహణకు అవసరమైన అనుమతులు, రిజిస్ట్రేషన్ తదితర అంశాలను పరిశీలించగా...