మూడు మున్సిపాలిటీలకు తీరనున్న తాగునీటి కష్టాలు..! 60 రోజుల్లో నీరు అందిస్తామంటే సంతోషంగా ఉంది: చైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి
ఆర్.జె.న్యూస్,మేడ్చల్ : తాగునీటి కోసం కొత్తగా ఏర్పడిన మూడు మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అలియాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో మరో 60 రోజుల్లో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నామని, ప్రజలకు క్రమం తప్పకుండా తాగునీరు అందించటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.గతంలో మేడ్చల్ నియోజకవర్గానికి పదేళ్లపాటు ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి ప్రస్తుత మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి హయాంలో ప్రజల సమస్యలకు తగిన ప్రాధాన్యం లభించలేదని ఆమె విమర్శించారు....